![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -660 లో..... రాజ్ కోర్ట్ లో గెలిచి ఇంటికి రాగానే కావ్య హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది. ఇక అందరు హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే.. అది ఓర్వలేకపోతుంది. మొన్న ఇలాగే సంతోషంగా ఉన్నాం రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా ఉంటే ప్రాబ్లమ్ ఏ రూపం లో వస్తుందోనని భయంగా ఉందని రుద్రాణి అనగానే..నీ నోటికి మంచిమాటలు రావా అంటూ ఇంట్లో వాళ్లు కోప్పడతారు. మరొకవైపు యామిని ఒక్కప్పుడు రాజ్ ని ప్రేమించిన అమ్మాయి.. తను అమెరికా నుండి ఇంటికి వస్తుంది. యామిని రాకతో తన తల్లితండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఎందుకు ఇంత లేట్ అయిందని యామిని తల్లిదండ్రులు అడుగుతారు. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే ఆగానని యామిని అంటుంది. ఇన్ని రోజుల తర్వాత పేరెంట్స్ కాకుండా ఫ్రెండ్ కి ఇంపార్టెంట్ ఇచ్చావ్.. ఇదేం బాలేదు అని వాళ్ల డాడ్ అంటాడు. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధపెట్టాను.. ఇక బాధపెట్టనని యామిని అంటుంది. అయితే పెళ్లి చేసుకుంటావా అని వాళ్ల అమ్మ అడగ్గానే.. ఎందుకు చేసుకోనంటూ రాజ్ ఫోటో చూపిస్తుంది. వాళ్ళు అది చూసి షాక్ అవుతారు. ఏంటి రాజ్ ఫోటో చూపిస్తున్నావ్.. తను వద్దన్నుందుకే కదా చావు అంచుల వరకు వెళ్లి వచ్చావని వాళ్ల డాడ్ అంటాడు. నేను అమెరికా వెళ్ళింది నా అలవాట్లు మార్చుకోవడానికి.. ప్రేమని కాదు అని యామిని అంటుంది. సరే రాజ్ పేరెంట్స్ తో మాట్లాడుతామని వాళ్ళ అమ్మ అనగానే మాట్లాడాల్సింది వాళ్ళ పేరెంట్స్ తో కాదు.. రాజ్ భార్య కావ్యతో అనగానే వాళ్ళు షాక్ అవుతారు. నాకు రాజ్ కావాలి.. తనని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తానని యామిని అంటుంది. మరొకవైపు కన్పించింది యామినీనే అని రాజ్ డైలామాలో ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు రాజ్. ఎవరైనా వస్తారని కావ్య అంటుంది. ఎవరు రారు ఒకవేళ వచ్చిన యముడికి అయినా అడ్డం తిరిగి మళ్ళీ నన్ను సొంతం చేసుకుంటావ్ కదా అని రాజ్ అంటాడు.
యామిని పేరెంట్స్ డాక్టర్ తో మాట్లాడతారు. తను సెట్ అయింది అనుకుంటే మళ్ళీ రాజ్ అంటుందని అనగానే చిన్నప్పటి నుండి తనేం కావాలని అనుకుంటుందో అది దక్కకపోతే భరించలేదు. తనకి కావల్సింది పొందడానికి ఏం అయినా చేస్తుంది లేదా చచ్చిపోతుంది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది తనని అర్థం చేసుకున్నట్లు ఉండి మెల్లగా తనలో మార్పు తీసుకొని రావాలని యామిని పేరెంట్స్ తో డాక్టర్ చెప్తాడు. మరోవైపు కావ్య ఫోటో కాల్చేస్తుంది యామిని. మరుసటి రోజు రాజ్ కి యామిని వాయిస్ మెసేజ్ చేస్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. కోర్ట్ దగ్గర చూసాను అలా చూస్తూ ఉండాలనిపించిందని యామిని అంటుంది. ఒక సర్ ప్రైజ్ హాల్లో ఉంది.. నువ్వు తప్ప ఎవరు చూడకూడదు.. వెళ్ళు త్వరగా అని యామిని అంటుంది. తరువాయి భాగం లో రాజ్ హాల్లో ఉన్న కవర్ తీసుకుంటాడు. అందులో యామిని, రాజ్ కలిసి ఉన్న ఫొటోస్ ఉంటాయి. అది ఎవరు రాకముందే రాజ్ త్వరగా తీసుకుంటాడు. అదే సమయంలో ఎవరో ఫోన్ చేసి రాజ్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |